ఇటీవల వడదెబ్బకు గురైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన నీరసంగా ఉన్న కారణంగా.. ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని వైద్యులు సూచించారు. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న కారణంగా.. ఆ సూచనను పవన్ తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఎండ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు పవన్‌కు సూచించారని తెలిపాయి. ప్రచారం సమయంలో తాము అందుబాటులో ఉంటానని వైద్యులు చేసిన విజ్ఞప్తినీ పవన్ సున్నితంగా తిరస్కరించినట్టు వెల్లడించాయి. ఈ మేరకు.. అనకాపల్లి, పెందుర్తి సభలకు జనసేనాని హాజరు కానున్నారు.
నీరసంగా ఉన్నా.. ప్రచారానికే జై కొట్టిన పవన్! - janasena chief pawan kalyan
జనసేన శ్రేణులను ఉత్సాహపరుస్తూ.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వడదెబ్బ నుంచి ఇంకా కోలుకోకపోయినా... సమయం తక్కువగా ఉన్న కారణంగా ప్రచారానికి వెళ్లేందుకు నిర్ణయించారు.