విశాఖ జిల్లా సింహాచలం.. సింహగిరిపై శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమాలతో పవిత్రోత్సవాలను ప్రారంభిస్తారు. 29వ తేదీన ఉదయం విశేష హోమాలు, పారాయణాలు, రాత్రి ఆదివాసములు, పారాయణాలు చేస్తారు.
30వ తేదీ ఉదయం విశేష హోమాలు, పారాయణాలు రాత్రి పవిత్ర సమర్పణ, 31న ఉదయం విశేష హోమాలు, పారాయణాలు, రాత్రి పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం ఏకాంత స్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 1 తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దుచేసినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.
ఇదీ చదవండి: