విశాఖలోని ద్వారకా బస్సు కాంప్లెక్స్, మద్దిలపాలెం బస్సు కాంప్లెక్స్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంత ఊర్లకు వెళ్లే ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ఒక్క విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళవారం రెండు వందల అదనపు సర్వీసులు నడిచాయి. ఉభయగోదావరి, కోస్తా జిల్లాలకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. హైదరాబాద్, కడప, కర్నూలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు బస్సులు నడిచాయి.
మరోవైపు రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎం.వై. దానం వెల్లడించారు. ప్రయాణికులను బట్టి అప్పటికప్పుడు తిప్పటానికి 70 బస్సులు సిద్ధం చేశామన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారుల ప్రత్యేక బృందం కృషి చేస్తోందని వెల్లడించారు.
ఇదీ చదవండి : రాష్ట్ర వ్యాప్తంగా.. సంక్రాంతి కోలాహలం