కరోనా వైరస్ రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో ముందస్తు చర్యల్లో భాగంగా.. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్డౌన్కు శ్రీకారం చుట్టారు. వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు పలు మండలాల్లోని వ్యాపార వాణిజ్య సంస్థలు ముందుగానే మూసివేసేలా పిలుపునిచ్చాయి.
నర్సీపట్నం డివిజన్లోని రావికమతం మండలంలో కొత్తకోట తదితర గ్రామాల్లో ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. అలాగే మాకవరంపాలెం మండలంలో కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ పాక్షిక లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. మరోపక్క నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి లో కరోనా రోగులకు అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ రోగుల అవస్థలు.. వార్డుల్లోకి స్నానాల గదుల్లోని నీరు