ETV Bharat / state

విశాఖలో పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం - vizag district latest news

విశాఖపట్నం జిల్లాలో రేపు జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా... తమకు భోజనాలు ఏర్పాటు చేయలేదంటూ జీ.మాడుగులలో ఎన్నికల సిబ్బంది ఆందోళన చేశారు.

parishath elections arrangements completed in vizag district
విశాఖపట్నం జిల్లాలో పరిషత్ ఎన్నికలు
author img

By

Published : Apr 7, 2021, 9:22 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఎస్.రాయవరం, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో.. గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బ్యాలెట్ పత్రాలు, సామగ్రి పంపిణీ చేశారు. పాడేరు డివిజన్​లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. మరోవైపు... జీ.మాడుగుల మండల పరిషత్ కార్యాలయం వద్ద విధులకు వచ్చిన ఉద్యోగులకు భోజనాలు ఏర్పాటు చేయలేదంటూ... ఎన్నికల సిబ్బంది ఆందోళన చేశారు.

నర్సీపట్నం డివిజన్​లో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, కోటవురట్ల తదితర మండలాల్లో ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతగా జరిగేలా భద్రతను పటిష్ఠం చేశారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు అనకాపల్లి ఆర్డీవో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేశారు.

ఇదీచదవండి.

పరిషత్​ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సంతృప్తిగా లేదు: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.