ETV Bharat / state

'ఆ బిడ్డ వద్దు.. మా కూతురే కావాలి' - పెదబయలులో శిశు వివాదం

పెళ్లి కాకుండానే ప్రేమ పేరుతో గర్భవతి అయ్యింది. మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారికి బిడ్డ వద్దని.. కూతురే కావాలని యువతి తల్లిదండ్రులు పట్టుబట్టారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండల పరిధిలో జరిగింది.

baby issue at peddabhayalu
తల్లీ బిడ్డ
author img

By

Published : Oct 28, 2020, 10:32 PM IST

విశాఖ జిల్లా పెదబయలు మండలానికి చెందిన గిరిజన యువతి, కప్పాడకు చెందిన ఏలియా అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలను అడిగారు. ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. అప్పటికే యువతి గర్భిణి. ఇంతలో.. యువకుడు ఏలియాకు వారి కుటుంబీకులు వేరే పెళ్లి చేసేశారు.

ఈ రోజు ఆస్పత్రిలో యువతి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చేందుకూ యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. శిశువును ఎవరికైనా ఇచ్చేస్తామని పట్టుబట్టారు. ఆస్పత్రి సిబ్బంది ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బిడ్డను వదిలేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. చివరికి వారు కొంతవరకూ సద్దుమణిగారు. తనకు న్యాయం చేయాలని యువతి డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి:

నవంబర్ 7న పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.