డీడీఓ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శుల నుంచి వీఆర్ఓలకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ... విశాఖపట్నం జిల్లా మాడుగుల, చీడికాడ మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని మండల పరిషత్ కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నంబర్ 2 ను రద్దు చేయకుంటే నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని పంచాయతీ కార్యదర్శులు హెచ్చరించారు. అనంతరం మాడుగుల, చీడికాడలో ఎంపీడీఓలు పొలినాయుడు, జయప్రకాశరావులకు వినతిపత్రాలు అందజేశారు.
ఇదీచదవండి.