పార్టీ మారలేదన్న కారణంతోనే... తనపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపులకు దిగుతున్నారని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎక్కడో ఉన్న భూములను చూపి తనవని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల మాట వినకపోతే ఇష్టానుసారం చేస్తారా? అని నిలదీశారు. జగరాజుపేటలో తనకు ఎకరం భూమి కూడా లేదని.. తుంగలంలో 41 ఎకరాల భూమి ఉందని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల అఫిడవిట్‌లోనూ తమ ఆస్తుల వివరాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసినందుకే తనపై అక్రమాల ఆరోపణలకు తెరలేపారని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వైకాపా నేతలు చెప్తున్న చోట తనకు గజం భూమైనా లేదని స్పష్టం చేశారు. తనకున్న ఆస్తుల వివరాలను మీడియా ఎదుట చూపించారు.
విశాఖ జిల్లా గాజువాక మండలంలో నిన్న అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ భూములు పల్లా కుటుంబానికి చెందినవని అధికార పార్టీ నేతలు ఆరోపించారు.
ఇదీ చదవండి: