ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్, కొజిరిగూడ గ్రామంకు చెందిన కిముడు దాసు అనే నిరుపేద ఆదివాసి గిరిజనుడిని ఇన్ఫార్మర్ అనే ముద్రవేసి ఈ నెల 20న అర్ధరాత్రి కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ముందే అతి కిరాతకంగా హత్య చేసి... మరో ఇద్దరు గిరిజనులను తీవ్రంగా గాయపరిచారు. గిరిజనులు నడిచే అటవీ మార్గం గుండా మందుపాతరలు పెట్టడం, సెల్ టవర్స్, రోడ్డు వేసే యంత్రాలు తగలపెట్టడం వల్ల గిరిజనులకు ఏ విధమైన అభివృద్ధి చేశారని అడిగారు. మీరు ఉన్న చోట విధ్వంసం తప్ప... అభివృద్ధి ఎప్పుడైనా, ఎక్కడైనా ఉందా అని డీఎస్పీ ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు నిలువు నీడ లేకుండా చేయండని గిరిజనులకు డీఎస్పీ పిలుపునిచ్చారు.
మావోల దుశ్చర్యలు:
2014లో రాళ్ళగడ్డ సర్పంచ్ సేంద్రి కార్ల, కిళ్ళంకోట బచ్చల బాలకృష్ణ, వీరవరం గెమ్మిలి సంజీవ రావు
2015లో గోబరిపొడలో పాంగి రామన్న, బూసిపుట్టులో పాంగి రామయ్య @ సిద్ధు
2016 లో సరియపుట్టులో పాంగి శివయ్య, జెర్రిళ్లలో సాగిన వెంకటరమణ, కుంకుమపూడి లో గుండురావు
2017 లో తుముడురాయిలో మత్స్య జినబంధు, మద్దిగరువులో సూర్యచంద్ర రావు, కిశోర్
2018లో చుక్కగొయ్యిలో వంతల బాలయ్య
2019 లో బొంగజంగి లో కొర్రా సత్తిబాబు, వీరవరం లో గెమ్మిలి బాష్కర రావు, పాంగి సత్తిబాబు,చిత్రకాయపుట్టులో కొర్రా రంగారావ్, కుంకుమపూడి లో లంబయ్యలను చంపడం జరిగింది.
ఇప్పటికైనా మావోయిస్టులు హింసను వీడి.. జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లేదా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే గిరిజనుల కోపాగ్నికి బలవుతారని హెచ్చరించారు. మావోలు మన్యాన్ని విడిచి పోవాలని... గిరిజనులంతా ముక్త కంఠంతో కోరుతున్నారని పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ వివరించారు.
ఇదీ చదవండి :