విశాఖ పాడేరు ఏజెన్సీలో గంజాయి ధ్వంసానికి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులపై నిన్న గిరిజనుల దాడికి యత్నించారు. ఈ ఘటనపై పాడేరు ఏఎస్పీ జగదీష్ స్పందించారు. అదనంగా 7 పోలీసులు పార్టీలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అలాగే మారుమూల ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. గంజాయి దాడులపై వాలంటీర్లు, సర్పంచులకు అవగాహన కల్పించనున్నట్లు ఏఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు.
అనుబంధ కథనం: Attack: గంజాయి పంట ధ్వంసం చేసేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనుల దాడి