విశాఖ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ నేటికీ ప్రారంభం కాకపోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా రబీలో పండిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ఏప్రిల్‌లో కొనుగోలు చేస్తూ ఉంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ధాన్యం సేకరణ ప్రారంభించలేదు. ఈ ఏడాది 10 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ సీజన్లో పండిన ధాన్యం.. ఇప్పటికే రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేశారు.
కొంత మంది రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలు కొనుగోలు చేస్తాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రబీ సీజన్లో పండిన ధాన్యం కొనుగోలు చేస్తామని… పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకట రమణ స్పష్టం చేశారు. కరోనా ప్రభావంతో ధాన్యం సేకరణలో జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 150 కేంద్రాల్లో లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. వాటి విక్రయాలకు సంబంధించి సుమారు 20 కోట్ల వరకు రైతులకు చెల్లింపులు జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: