విశాఖ జిల్లా భీమిలి సీబీఎం పాఠశాలలో 1969 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది. తాము పదోతరగతి చదివి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా భీమిలి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అభ్యసించిన 92మంది విద్యార్థుల్లో... 42 మంది పూర్వ పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు. చిన్నపిల్లలాగా మారి గురువుల వద్ద మారాం చేశారు. ముఖ్య అతిథిగా భీమిలి జోనల్ కమిషనర్ సి.హెచ్ గోవిందరావు హాజరై ప్రసంగించారు. అప్పటి గురువులు నరసింహం, డి.ఎస్. శర్మ, వి. రామకృష్ణను సన్మానించుకున్నారు.
ఇది కూడా చదవండి.