విశాఖ జిల్లా అనకాపల్లి మండలం ఏలేరు కాలువలో దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఉడిపేటలో ఆయన నివాసముంటుండగా.. అతడి కుమారుడు, కుమార్తెకు కరోనా సోకిందని ఎస్సై ధనుంజయ్ తెలిపారు. వృద్ధుడికీ అనారోగ్యంగా ఉండటం వల్ల భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: