విశాఖ మన్యం పర్యటక కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధుడు పాముకాటుకు గురై ఆసుపత్రి పాలయ్యారు. మహమ్మద్ అనే వృద్ధుడు కుటుంబ సమేతంగా పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి వచ్చారు. అక్కడ నడుస్తుండగా ఆయనను పాము కాటు వేసింది. కుటుంబీకులు హుటాహుటిన జి.మోడల్ ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విహారంలో ప్రమాదం జరగటం వల్ల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: అమరావతి రైతులకు తెదేపా నేతల సంఘీభావం