విశాఖ జిల్లాలో ఇసుక కొరత నివారణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి ఇసుక తీసుకొచ్చి ఈ-మర్రిపాలెం, ముడసలోవ వద్ద డిపోలలో నిల్వచేస్తున్నారు. గనుల శాఖ వెబ్సైట్లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారుడు... మర్రిపాలెం డిపోలో రసీదు చూపిస్తే ఇసుక తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. రోజుకు 5 నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. టన్నుకు రూ.1300 నుంచి రూ.1400 ఖర్చవుతోందని వివరించారు. రెవెన్యూ, పోలీస్, రవాణా, గనుల శాఖ సంయుక్తంగా ఇసుక డిపోలు నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి...'భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా