ఎన్పీఆర్పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర ముస్లిం అసోసియేషన్ ప్రకటించింది. మాజీ శాసనసభ సభ్యులు, ఉత్తరాంధ్ర ముస్లిం అసోసియేషన్ ప్రతినిధి ఎస్ఏ రెహమాన్ ఆధ్వర్యంలో ముస్లిం సభ్యులు విశాఖలో సభ నిర్వహించారు. ఈ సందర్భగా రెహమాన్ మాట్లాడుతూ, 2010లో అనుసరించిన జనగణన నిబంధనలే పాటిస్తామన్న సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమన్నారు. మద్యపాన నిషేధం తెదేపాకు నచ్చదనీ, అందుకే జే ట్యాక్స్ అంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో 12 సార్లు మద్యం ధరలు పెంచలేదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: