కరోనా కట్టడి కోసం పాడేరు ఘాట్ రోడ్డు ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన శానిటైజేషన్ ఛాంబర్ నిరూపయోగంగా మారింది. తొలి రోజుల్లో ఏదో ఆర్బాటంగా ప్రారంభించి వారం పాటు నిర్వహంచారు. ఆ తర్వాత గాలికొదిలేశారు. పాడేరు ఘాట్ రోడ్డు ప్రవేశ మార్గం గరికబంద చెక్ పోస్ట్ వద్ద ఈ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. 40 వేల రూపాయలు వెచ్చించారు.
ఈ ద్వారం నుంచి పాడేరు 32 కిలోమీటర్ల దురంలో ఉంటుంది. ఇక్కడి నుంచి వాహనాల రాకపోకలే తప్ప.. ఛాంబర్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు పోలీసులు మాత్రమే వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ చాంబర్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: