గుమ్మడి కాయను కొంతమంది కూరల్లో వినియోగిస్తారు. మరికొందరు దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు. అలాంటి వాటిని విశాఖ జిల్లా పాడేరు మన్యంలో ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. కొనేవారు లేక ఇళ్లలోనే కుళ్ళిపోతున్నాయి. మన్యం గిరిగూడెంలో గిరిజనులు విస్తారంగా పెరట్లో వీటిని పండిస్తారు. పంటకు అయిన ఖర్చులు రాకపోవడంతో అలానే వదిలేస్తున్నారు. వ్యాపారులు వచ్చి గుమ్మడికాయలు కొంటే... ఆర్థికంగా లాభపడతామని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమ్మవారికి సారె... వైభవంగా ఊరేగింపు