ETV Bharat / state

ఆటిజం చిన్నారులకు స్టెమ్‌సెల్‌ చికిత్స పేరిట దోపిడీ - ఆటిజం పిల్లల చికిత్సపై ఎన్​ఎంసీ మార్గదర్శకాలు

ఆటిజం చిన్నారులకు స్టెమ్‌సెల్‌ చికిత్స పేరిట కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి. దీనిపై ఎన్‌ఎంసీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానానికి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ విధంగా ప్రచారం చేసుకునే వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలకు వెనుకాడేదిలేదని ఎన్‌ఎంసీ హెచ్చరించింది.

ఆటిజం చిన్నారులకు స్టెమ్‌సెల్‌ చికిత్స పేరిట దోపిడీ

author img

By

Published : Dec 19, 2022, 8:42 AM IST

ఆటిజం.. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో పట్టిపీడిస్తున్న ఆరోగ్య సమస్య. న్యూరో డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌. దీనికి మూలకణాల (స్టెమ్‌సెల్‌) ద్వారా చికిత్స అందిస్తామంటూ కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు, కొందరు వైద్యులు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి ప్రకటనలకు ఆకర్షితులవుతూ.. ఆటిజం బారినపడిన పిల్లలను అక్కడికి తీసుకెళుతూ తల్లిదండ్రులు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. చికిత్స కోసం రూ.లక్షలు వెచ్చించినా ఫలితం రాకపోవడంతో నిరాశకు లోనైన తల్లిదండ్రుల్లో కొందరు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఆటిజం చికిత్సలో మూలకణ చికిత్సపై మార్గదర్శకాలు రూపొందించాలంటూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ని ఆదేశించింది. ఈమేరకు ఎన్‌ఎంసీ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. మూలకణ చికిత్సతో ఆటిజం నయమైనట్లుగా శాస్త్రీయ నిరూపిత ఆధారాలేమీ లేవని తేల్చింది. దీని పేరిట ప్రచారం చేయడమంటే ప్రజలను మోసగించడమేనని పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ చికిత్సగా దీన్ని వినియోగించవద్దని.. ఒకవేళ అందించాల్సి వస్తే.. తల్లిదండ్రుల అంగీకారం, ముందస్తు ప్రభుత్వ అనుమతి పొందాలని స్పష్టంచేసింది. దీన్ని ప్రయోగాత్మక అధ్యయనంగా మాత్రమే చేపట్టాలని, అయితే రోగుల నుంచి ఏ రూపంలోనూ డబ్బులు వసూలుచేయరాదని తేల్చిచెప్పింది. ఈ విధానంపై ప్రచారం చేసుకునే వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలకు వెనుకాడేదిలేదని హెచ్చరించింది.

అమెరికా పరిశోధనల్లోనూ: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10వేల మందిలో 76 మంది ఆటిజంతో బాధపడుతుంటారని అంచనా. తెలంగాణలోని ఒక పిల్లల ఆసుపత్రిలో ఇటీవల కాలంలో రోజుకు 10మంది వరకూ ఆటిజం బాధిత చిన్నారులు చికిత్స కోసం వస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో ఇది 3-4 రెట్లు అధికంగా నమోదవుతోంది. ఆటిజం రావడానికి కచ్చితమైన కారణాలేమీ ఇంతవరకు తెలియరాలేదు. నిర్దిష్టమైన చికిత్స కూడా రాలేదు.

ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు రకరకాల పద్ధతుల్లో చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మూలకణ చికిత్స తెరపైకి వచ్చింది. అమెరికాలో 2020లో డ్యూక్‌ విశ్వవిద్యాలయంలో 180మంది ఆటిజం పిల్లలపై ఈ కోణంలో చికిత్స అందించారు. అయితే ఈ ప్రయోగంలో సానుకూల ఫలితాలు కనిపించలేదు. ఇతర దేశాల్లోనూ కొంతమేర చేసిన ఇలాంటి చికిత్సల్లో ఆశించిన పురోగతి లేదు.

ఆటిజంను గుర్తించడమెలా?: దీని బారిపడిన చిన్నారులు ఏదైనా వస్తువు పెద్దశబ్దంతో ఎత్తేస్తే అటువైపు చూస్తారు. పేరుపెట్టి పిలిస్తే మాత్రం పలకరు. అమ్మ ఎక్కడుందని అడిగితే చూపించరు.. మాట్లాడలేరు. ఇతర పిల్లలతో ఆడుకోరు. బహిరంగ ప్రదేశాలకు తీసుకువెళితే తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా ఉంటుంటారు. కొందరు ఒకచోట కుదురుగా కూర్చోరు. ఒక బొమ్మ తీసుకుంటారు.. 2 నిమిషాలు ఆడుతారు. దాన్నిపడేసి మరో అంశంపైకి దృష్టిసారిస్తారు. అక్షరాలను రాయడానికి కూడా ఏళ్లు పడుతుంటుంది. 7-8 ఏళ్లు దాటినా కూడా పక్క తడిపేస్తుంటారు. మలమూత్ర విసర్జన సమస్యగా మారుతుంది. కొందరు పిల్లలు కొన్నిరకాల ఘనాహారాలను కూడా నమిలి మింగలేరు. కొందరికి నిద్ర సరిగా పట్టదు. చిన్న విషయాలకే చిరాకు పడుతుంటారు. సాధారణంగా 9-12 నెలల వయసు నుంచే పిల్లల్లో ఈ తేడాలను గుర్తించవచ్చు.

తల్లి గర్భం నుంచే భావోద్వేగాలను పంచాలి: తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువుతో ఎక్కువగా మాట్లాడుతుండాలి. సానుకూల వాతావరణంలో తల్లి తన భావోద్వేగాలను పంచాలి. శిశువు పుట్టిన తర్వాత తొలి 1000 రోజుల్లో.. రోజుకు కనీసం 10వేల పదాలు శిశువుకు వినిపించాలి. నవ్వులు, ఏడుపులు, అరుపులు, ముఖ కవలికలు, భావోద్వేగాలను పలికించడం ద్వారా శిశువు మెదడులో అవన్నీ నిక్షిప్తమవుతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు అప్పటి నుంచే అభివృద్ధి చెందుతాయి. ఎటువంటి పదాలు, భావోద్వేగాలను పంచితే.. శిశువు మెదడులో ఆ తరహావే వృద్ధి చెందుతాయి. దురదృష్టవశాత్తు చాలామేర శిశువులకు ఇప్పుడు అవి అందడం లేదు. తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్తున్నారు. ఇంట్లో పెద్దవారు ఉండడం లేదు. ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే శిశువు ఎక్కువకాలం గడపాల్సి వస్తోంది. ఆటిజానికి కచ్చితమైన చికిత్స ఏమీలేదు. అయితే వారి లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌ థెరపీ, బిహేవియర్‌ థెరపీ వంటి చికిత్సలు అందించడం ద్వారా కచ్చితంగా మెరుగుదల కనిపిస్తుంది. మూలకణ చికిత్స ద్వారా నయమవుతుందనడానికి మాత్రం ఆధారాల్లేవు.

- డాక్టర్‌ లోకేశ్‌ లింగప్ప, పిడియాట్రిక్‌ న్యూరాలజిస్ట్‌

ఇవీ చదవండి:

సోగ్గాడే కాదు సో రిచెస్ట్​ పర్సన్ శోభన్​బాబు ఆస్తులు తెలిస్తే

రైలులో మొబైల్​ చోరీ చేసిన యువకుడిని బయటకు తోసేసి హత్య

వయసు 23 నెలలే.. ప్రపంచ రికార్డుల్లో చోటు.. ఈ బుడ్డోడి తెలివికి సలాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.