తమిళనాడులోని కడలూరు వద్ద తీరం దాటిన నివర్ తుపాన్ ప్రభావం విశాఖ జిల్లాలో కనపడుతోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తేలిక పాటి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల పంటపొలాలు నీట మునిగాయి. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోటవురట్ల, నక్కపల్లి, య.స్ రాయవరం, పాయకరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంటలు నీట మునిగాయి. అకాల వర్షాలకు నీట మునిగిన పొలాలను వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించారు. వ్యవసాయ అధికారిణి సౌజన్య రైతులకు పలు సూచనలు చేశారు. మునిగిన పంట చేలో నీరు పోయేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి: