అనకాపల్లిలో భాగ్యలక్ష్మి అనే గర్భిణీని ప్రసవం నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా.. శిశువు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని భాగ్యలక్ష్మి తల్లి నూకరత్నం ఆరోపించింది. సాధారణ ప్రసవం పేరుతో కాలయాపన చేశారన్నారు. వైద్యులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. గర్భిణీకి నొప్పులు రాకపోవడంతో మాత్ర ఇచ్చామని తెలిపారు. బిడ్డ మెడలో పేగు చుట్టుకుని.. ఉమ్మ నీరు తాగడం వల్ల మరణించిందని తెలిపారు. ఇందులో తమ నిర్లక్ష్యం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...