విశాఖ తూర్పు నౌకాదళ స్థావరంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబరులో నిర్వహించే నౌకాదళ దినోత్సవం సందర్భంగా నేవల్ డాక్ యార్డులో రక్తదాన శిబిరాన్ని సర్జన్ రియర్ అడ్మిరల్ డాక్టర్ సీఎస్ నాయుడు ప్రారంభించారు. విశాఖ కెజిహెచ్ , ఎన్టీఆర్ స్మారక బ్లడ్ బ్యాంకుల సహకారంతో శిబిరం నిర్వహించారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...పలువురు నావికాదళ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు, సివిల్ ఉద్యోగులు రక్తదానం చేశారు. 316 యూనిట్ల రక్తాన్ని బ్లడ్ బ్యాంకుకు అందించారు.
ఇదీచదవండి