.
అమరవీరులకు నౌకాదళ అధికారులు నివాళి - విశాఖలో అమరవీరులను నౌకాదళ అధికారులు నివాళి
విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగరతీరంలోని అమరవీరుల స్థూపం వద్ద నౌకాదళ అధికారులు నివాళులు అర్పించారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏకే.జైన్.. పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. కలెక్టర్ వినయ్‌చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులకు శ్రద్ధాంజలి అర్పించారు. ఆ తర్వాత "విక్టరీ ఎట్ సీ" వద్ద నౌకాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
navy-day-celebrations-in-visakha
.
sample description
Last Updated : Dec 4, 2019, 2:42 PM IST