ETV Bharat / state

శత్రు భయంకర నౌక 'ఐఎన్​ఎస్​ రాజ్​పుత్'​కు వీడ్కోలు - విశాఖపట్నం తాజా వార్తలు

శత్రుభయంకర నౌక ఐఎన్​ఎస్ రాజ్​పుత్​ను నేవీ వర్గాలు వీడ్కోలు పలికాయి. విశాఖలోని తూర్పు నౌకదళ కేంద్రం వద్ద సీనియర్​ అధికార్ల సమక్షంలో ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 41 ఏళ్ల పాటు సేవలందించిన ఈ నౌకను రష్యా సహకారంతో నిర్మించారు.

శత్రు భయంకర నౌక ఐఎన్​ఎస్​ రాజ్​పుత్​కు నేవీ వర్గాల వీడ్కోలు

author img

By

Published : May 22, 2021, 7:55 AM IST

భారత నౌకాదళంలో మొట్టమొదటి శత్రు భయంకర నౌక ఐఎన్​ఎస్ రాజ్​పుత్‌కు నేవీ వర్గాలు వీడ్కోలు పలికాయి. విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రం వద్ద ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహుదూర్‌ సింగ్‌....సీనియర్ అధికార్ల సమక్షంలో ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేడెట్ డిఫెన్స్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఏకే జైన్‌ అంతర్జాలం ద్వారా వీక్షించారు.

దాదాపు 41 ఏళ్ల పాటు సేవలందించిన ఈ నౌకను రష్యా సహకారంతో నిర్మించారు. 1980 మే 4న దీనిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. సుమారు 4 దశాబ్దాలుకు పైగా నౌకాదళంలో ఎన్నో కీలక ఆపరేషన్లలో ప్రముఖ పాత్ర పోషించింది. కెప్టెన్‌ గులాబ్‌ మోహన్‌లాల్‌ హిరానందనీ దీనికి తొలి కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సమర్థంగా సేవలందించింది. 1988 వరకూ పశ్చిమ కమాండ్ పరిధిలో ఉంది. ఆ తర్వాత తూర్పునౌకాదళానికి అనుసంధానం చేశారు. విపత్తుల సమయంలోనూ విశేష సహాయ కార్యక్రమాలకు దీనిని ఉపయోగించారు. ఈ నౌక మొత్తంగా 7 లక్షల 87 వేల 194 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించింది.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీగా తగినవారా అనే సందేహం కలుగుతోంది : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.