ETV Bharat / state

ఔషధ మెుక్కలు సాగుచేస్తూ పురాతన వైద్యమందిస్తున్నాడీ యువకుడు! - విశాఖలో ప్రకృతి వైద్యం తాజా వార్తలు

కరోనా విజృంభణ వేళ పురాతన ప్రకృతి వైద్యం గొప్పతనం.. మరోసారి అందరికీ తెలిసింది. ఈ అవసరాన్ని ఎప్పుడో గుర్తించిన ఓ యువ రైతు....ఔషధ మొక్కలు సాగుచేస్తూ ప్రకృతి వైద్యం అందిస్తున్నాడు. దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తున్నాడంటూ రోగులు అభినందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం అతని వద్దకు వైద్యం కోసం వస్తున్నారు.

ఔషధ మెుక్కలు సాగుచేస్తూ.. పురాతన వైద్యమందిస్తున్నాడీ యువకుడు!

author img

By

Published : Oct 10, 2020, 10:30 PM IST

మానవాళికి పెనుముప్పుగా మారిన ఎన్నో రోగాలను... పురాతన వైద్యం ద్వారా భారతీయులు సమర్థంగా ఎదుర్కొన్నారని వైద్యులు చెబుతారు. ప్రకృతి వైద్యం ద్వారా అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చునంటూ.. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం రాజకోడూరుకు చెందిన మత్త వెంకట రమణ నిరూపిస్తున్నాడు. డిగ్రీ చదివినా ప్రకృతి వైద్యమంటే మక్కువతో...ఔషధ మొక్కలు సాగుచేస్తున్నాడు. ఆయుష్ విభాగం ద్వారా ప్రత్యేక శిక్షణ పొంది... ప్రకృతి వైద్యం అందిస్తున్నాడు. గుజరాత్‌లో ప్రకృతి వైద్య నిపుణుల అంతర్జాతీయ సదస్సులో సైతం అభినందనలు అందుకున్నాడు.

తరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రమణ కుటుంబసభ్యులు.... ప్రకృతి వైద్య కుటీర నిర్మాణం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో... ఔషధ మొక్కల మధ్య హాయిగా విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేశారు. రోగులకు ప్రకృతి వైద్యం అందించటమే కాకుండా... మరింత మందికి ఇందులో శిక్షణ ఇస్తున్నారు. కీళ్లనొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులకు....రమణ అందించే ప్రకృతి వైద్యం ఎంతగానో ఫలితం ఇస్తోందని రోగులు చెబుతున్నారు.

ప్రకృతివైద్యం గొప్పతనాన్ని తెలియజేయటమే కాకుండా....ప్రజలందరీ పురాతనవైద్యాన్ని దగ్గర చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానని వెంకటరమణ చెబుతున్నారు.

ఔషధ మెుక్కలు సాగుచేస్తూ.. పురాతన వైద్యమందిస్తున్నాడీ యువకుడు!

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 5,653 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.