సహజ ప్రకృతి అందాలు నీటిపై ప్రతిబింబాలుగా చూసేవారికి కనువిందు చేశాయి. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ఈ అద్భుత, అందమైన దృశ్యంతో సందర్శకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం జలాశయంలో నీరు నిండుకుండలా ఉండడంతో అవతల వైపున్న కొండవాలు ప్రకృతి అందాలు జలాశయం నీటిపై రెండుగా కనిపిస్తున్నాయి. ఈ అందాలను సందర్శకులు, ప్రకృతి ప్రేమికులు కనులారా తిలకించి ఆహ్లాదం పొందుతున్నారు.
ఇవీ చదవండి: విశాఖలో మరిన్ని బస్సులు నడపనున్న ఆర్టీసీ