విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటితో పాటు పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మున్సిపల్ సిబ్బందికి నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పీపీఈ కిట్లు అందజేశారు. సుమారు ఆరు నెలలుగా పట్టణంలో కరోనా వ్యాప్తి చెందుతున్నా.. స్థానిక మున్సిపల్ కార్మికులు ఎంతగానో సేవలు అందిస్తున్నారని సబ్ కలెక్టర్ అన్నారు. కరోనా నుంచి రక్షణ కోసం 40 మందికి పీపీఈ కిట్లు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఎలా అనుమతించింది?'