ETV Bharat / state

రావు ఖాతా భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్ - latest news in vishaka

విశాఖలోని రావు ఖాతా భూములపై వివాదం చెలరేగుతోంది. కొంతమంది నాయకులు ఈ భూములను స్వాధీనం చేసుకొవటానికి ప్రయత్నిస్తున్నారని... దళిత రైతులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు.

sub-collector  inspected the Ravukatha  lands
రావు ఖాతా భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్ నారపరెడ్డి
author img

By

Published : Nov 20, 2020, 4:40 PM IST

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం తోటిపాలలోని రావు ఖాతా భూములను నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. స్థానికంగా ఉన్న సర్వే నెంబరు 210లో గల 76 ఎకరాల 55 సెంట్ల భూమి వివాదస్పదంగా మారింది. కొంతమంది నాయకులు ఈ భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని దళిత రైతులు ఫిర్యాదు చేశారు . విచారణ చేపట్టిన సబ్​ కలెక్టర్.. భూముల వివరాలపై ఆరా తీశారు. త్వరలోనే రైతులతో సమావేశమై వివాద భూములకు సంబంధించి పూర్తి వివరాల సేకరిస్తామని చెప్పారు. అనంతరం అవసరమైన విచారణ చేపట్టి నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...రాజకీయ పార్టీలకు ఓటర్ల ముసాయిదా జాబితా అందజేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.