ETV Bharat / state

'వచ్చే నెల 4వరకు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తాం' - నర్సీపట్నంలో లాక్​డౌన్ నిబంధనలపై స్పందించిన ఆర్డీఓ

రెడ్​జోన్ ప్రాంతమైన నర్సీపట్నంలో వచ్చే నెల 4 వరకు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తామని ఆర్డీఓ తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

narsipatnam rdo reacts on redzone areas
నర్సీపట్నంలో లాక్​డౌన్ నిబంధనలపై స్పందించిన ఆర్డీఓ
author img

By

Published : Apr 13, 2020, 4:47 PM IST

రెడ్​జోన్​గా ప్రకటించిన విశాఖ జిల్లా నర్సీపట్నంలో వచ్చే నెల 4 వరకు లాక్​డౌన్​ నిబంధనలు పటిష్ఠంగా అమలు జరుపుతామని ఆర్డీఓ కె.లక్ష్మీశివజ్యోతి వెల్లడించారు. నర్సీపట్నంలో ఈనెల ఆరో తేదీన రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సుమారు మూడు కిలోమీటర్ల పరిధి వరకు ఈ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బాధితులిద్దరూ విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆర్డీఓ తెలిపారు. భవిష్యత్తులో కరోనా కేసులు నమోదు కాకుండా ఉంటే వచ్చే నెల 4వ తేదీ నుంచి రెడ్ జోన్​లో సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి డివిజన్​లో బియ్యంతో పాటు శనగలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆర్డీవో తెలిపారు.

ఇదీ చూడండి: చోడవరంలో రిక్షా కార్మికులకు బియ్యం పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.