ETV Bharat / state

పోలింగ్​ సెంటర్లను పరిశీలించిన అధికారులు - స్థానిక సంస్థల ఎన్నికల తాజా వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని విద్యాలయాలను జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరచే గదుల కొలతలు తీసుకున్నారు.

Narsipatnam officials  inspected polling centers
ఉపాధ్యాయుడితో మాట్లాడుతున్న జిల్లా అధికారి
author img

By

Published : Mar 11, 2020, 7:13 PM IST

పోలింగ్​సెంటర్లను పరిశీలించిన నర్సీపట్నం అధికారులు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికారులు పరిశీలించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రతకు అవకాశాలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, డాన్ బాస్కో కళాశాల.. తదితర విద్యాలయాలను సందర్శించారు. పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ, విశాఖ డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విశ్వేశ్వరరావు, నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతిల బృందం.. ఆయా విద్యా సంస్థల్లోని గదులు పరిశీలించారు. వాటి పొడవు, వెడల్పు, గాలి, వెలుతురు వివరాలు సేకరించారు. ఏజెన్సీ పరిధిలోకి వచ్చే ఒకటి రెండు మండలాల్లోని గ్రామాల పోలింగ్​ను.... నర్సీపట్నంలో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

స్థానిక సంగ్రామం: ఆ గ్రామంలో ఎన్నికల్లేవ్..ఎందుకంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.