ETV Bharat / state

ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినికి బాక్సింగ్​లో బంగారు పతకం - తొమ్మిదవ రాష్ట్రస్థాయి బాక్సింగ్​ పోటీలు

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో చదువుతున్న కృష్ణవేణి.. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుంది. బంగారు పతక విజయంతో.. జాతీయ స్థాయి పోటీలకు ఆమె అర్హత సాధించింది.

narsipatnam junior college student won gold medal
నర్సీపట్నం ప్రభుత్వ మహిళా కళాశాల
author img

By

Published : Feb 22, 2021, 8:59 PM IST

ఈనెల 20,21 తేదీలలో విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో చదువుతున్న కృష్ణవేణి బంగారు పతకం కైవసం చేసుకుంది. 9వ రాష్ట్రస్థాయి బాక్సింగ్​లో బంగారు పతక గెలవటంతో.. జాతీయ స్థాయి పోటీలకు ఆమె అర్హత సాధించింది.

విజేతగా నిలిచిన కృష్ణవేణిని కళాశాల ప్రిన్సిపల్ కామేశ్వరరావు, అధ్యాపక సిబ్బంది ప్రత్యేకంగా సన్మానించారు. అలాగే సహ విద్యార్థులు, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కృష్ణవేణికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందని పౌష్టికాహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.