విశాఖ జిల్లా నర్సీపట్నంలో మరోసారి కరోనా కలవరం రేగింది. పట్టణంలోని గవర వీధిలో మరో పాజిటివ్ కేసును వైద్యులు గుర్తించడంతో ప్రజల్లో ఆందోళన చోటుచేసుకుంది.
నర్సీపట్నానికి సంబంధించి గతనెలలో మూడు పాజిటివ్ కేసులను గుర్తించిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని కొంతమంది ముస్లింలు నర్సీపట్నంలో కొద్దిరోజుల పాటు బస చేయడం వల్ల రెండు విడతలుగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని 22 , 23 , 24 , వార్డులను రెడ్ జోన్ గా ప్రకటించారు. దీంతో పాటు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలను కొనసాగిస్తున్నారు. రెడ్‌జోన్ నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ ఈనెల 17తో ముగియనుంది. కానీ 15వ తేదీన మరో పాజిటివ్ కేసును గుర్తించడంతో పట్టణంలో కలవరం మొదలైంది. ఈ ప్రభావంతో మరెన్ని రోజులు రెడ్ జోన్ తో అవస్థలు పడాలోనని ఆందోళన చెందుతున్నారు.
ఇది చదవండి సీఎం సహాయ నిధికి దాతల చేయూత