ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఉచిత విద్యుత్ పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సబ్‌కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి డివిజన్ స్థాయి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు. డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలు వారికి కేటాయించిన పనులను పక్కాగా అమలు చేయాలన్నారు.
గ్రామస్థాయిలో వీఆర్వో, విద్యుత్ సిబ్బంది, వ్యవసాయశాఖ ఫీల్డ్ ఆఫీసర్‌తో కూడిన బృందం... రైతుల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై అవగాహణ కల్పించాలన్నారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు, రైతు ఖాతాలో నగదు బదిలీపై తదితర అంశాలపై పూర్తిస్థాయిలో వివరించి రైతులకు ఉన్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: తిరుపతి యువతి.. మూగజీవాల ప్రియనేస్తం!