విశాఖ జిల్లా అనకాపల్లిలో సినీనటుడు అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలను అభిమానులు నిర్వహించారు. కరోనా ఉన్నందున నిబంధనలు పాటిస్తూ ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో 61వ పుట్టినరోజును జరిపారు. కేకు కట్ చేసి స్థానికులకు పంచారు. పేదలకు కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయం: మంత్రి అవంతి శ్రీనివాస్