Varra Ravinder Reddy Remand Report: సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి సజ్జల భార్గవ్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టామని వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అంగీకరించారు. ఇవాళ తెల్లవారుజామున కడప రెండో అదనపు మెజిస్ట్రేట్ ముందు వర్రాను పోలీసులు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు. పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి నేరాన్ని అంగీకరించిన రిమాండ్ రిపోర్టులోని పలు అంశాలు బయటికి వచ్చాయి.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై పోస్టులు పెట్టలేదని సజ్జల భార్గవ్ రెడ్డి తనను తీవ్రంగా బెదిరించారని వర్రా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆరోజు నుంచి తన ఐడీ, పాస్ వర్డ్ ఆయన వద్దే ఉంచుకున్నారని అన్నారు. 2023 జనవరిలో షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టినందుకు వారు తనపై హైదరాబాద్‌లో కేసులు పెట్టారన్నారు. వీరిపై పోస్టులు పెట్టాలనే కంటెంట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కాగా ఆ పోస్టులు ఎలా పెట్టాలనేది మాత్రం అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి పలుమార్లు చర్చించుకున్నారని తెలిపారు.
తాడేపల్లి కార్యాలయం నుంచే పోస్టులన్నీ పెట్టారు: డీఐజీ
2023 సెప్టెంబరులో పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టామని వివరించారు. సిద్ధవటానికి చెందిన వెంకటాద్రి అనే వ్యక్తి ఆ పోస్టులు తొలగించాలని అడగగా 2 లక్షల రూపాయలు ఇస్తే తొలగిస్తానని బెదిరించినట్లు వర్రా వాంగ్మూలంలో వెల్లడించారు. 2020 నుంచి ఐప్యాక్ టీం సూచనల మేరకు టీవీ ఛానల్స్‌లో జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిమని తెలిపారు.
వైఎస్సార్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా కన్వీనర్లు, కో కన్వీనర్లు పనిచేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనకు నెలకు 13 వేల రూపాయలు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చేవారని వర్రా రవీందర్ రెడ్డి పోలీసు విచారణలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకమని వర్రా రవీందర్ రెడ్డి తెలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు - సుప్రీంకోర్టులో కీలక పరిణామం
ఎంపీ అవినాష్ చెబితేనే రాఘవరెడ్డి నోట్ చేసుకొని వర్రాకు ఇచ్చాడు : డీఐజీ కోయ ప్రవీణ్