Janasena Leader: ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పవన్ పోటీ చేయవచ్చునని తెలిపారు. పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పవన్ కల్యాణ్ పాదయాత్ర చేయరని.. కానీ ప్రభావంతమైన కార్యక్రమాన్ని చేపడతారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని.. తాను పార్టీ సేవలకే పరిమితమని చెప్పారు.
వైకాపా నేతలు విశాఖ రుషికొండను మాయం చేయాలని చూస్తున్నారని నాగబాబు ఆరోపించారు. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఎక్కడ ఏ కొండలు తవ్వేద్దామా ? అనే ధోరణితో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. చాలా చిన్న విషయాలకు జనసైనికులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలంగా ఉందన్న నాగబాబు.. త్వరలోనే బూత్ కమిటీలు వేసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి
కన్నతల్లి కర్కశత్వం.. ఏడ్చారని ఇద్దరు పిల్లలను చంపేసింది!
ఆర్య సమాజ్ వివాహ ధ్రువపత్రాలు చెల్లవు: సుప్రీం
హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు.. ఏడుగురు మృతి.. అంతా తెలుగువారే!