ఎన్ఏడీ ఫ్లై ఓవర్‌కు సంబంధించి పనులను ఈ నెల 31 వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు చెప్పారు. విశాఖలోని చిల్డ్రన్స్ ఎరినాలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి నుంచి లా కాలేజీ వైపున్న మార్గాన్ని ఫిబ్రవరి నెలాఖరు పూర్తి చేస్తామని చెప్పారు.
వీఎంఆర్డీఏ కార్యాలయ సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణం ఈ ఏడాదిలో పూర్తవుతుందని అన్నారు. దీంతో 550 కార్లు పార్క్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. నేచురల్ హిస్టరీ పార్క్‌ను 2022 నాటికి సిద్ధం చేస్తామన్నారు. సీ హారియర్స్, ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, ప్లానిటోరియంలను నగరంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
కైలాసగిరి మీద 60 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. కరోనా వల్ల వీఎంఆర్డీఏకు ఆదాయం తగ్గిందన్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 815 లే ఔట్లు అనధికారికంగా గుర్తించినట్టు చెప్పారు. వాటిలో 415 లే ఔట్ల నుంచి నాలుగు వేల దరఖాస్తులు క్రమబద్ధీకరణకు వచ్చాయని కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖలో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు