విశాఖ నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. విశాఖ నగరానికి మెట్రో వచ్చేలా కృషి చేసి... రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తానని చెప్పారు. విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణ... విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరంలో నీటి సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాటం చేస్తామని చెప్పారు. అందుకోసం అమసరమైతే... రాజీనామాకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ...