ETV Bharat / state

'డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన' - క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో - TTD EO VISIT TIRUPATI SVIMS

స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లిన టీటీడీ ఈవో శ్యామలరావు - క్షతగాత్రుల పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడిన టీటీడీ ఈవో

TTD_EO
TTD EO SHYAMALA RAO (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

TTD EO Visits Tirupati SVIMS Hospital: తిరుపతిలో వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో ఆస్వస్థతకు గురైన భక్తులను టీటీడీ ఈవో పరామర్శించారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లిన టీటీడీ ఈవో శ్యామలరావు చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు.

విచారణ తర్వాత పూర్తి వివరాలు: తొక్కిసలాట ఘటనకు కారణాలపై విచారణ జరుగుతోందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని అన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, క్షతగాత్రులు రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇద్దరికి మాత్రమే తీవ్రగాయాలయ్యాయని, చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మిగతా వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని అన్నారు.

డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది: టీటీడీ ఈవో (ETV Bharat)

తిరుపతి టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వైకుంఠద్వార దర్శనానికి టోకెన్ల జారీ కేంద్రాల వద్దకి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బైరాగిపట్టెడ టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. తోపులాట ఘటనలో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం: 35 మందిని డిశ్చార్జ్ చేసిన వైద్యులు: అస్వస్థతకు గురైన వారిలో ప్రాథమిక చికిత్స అందించి 35 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. రుయా ఆస్పత్రిలో ఉన్నవారిని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్విమ్స్‌లో 13 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు నేడు స్విమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు.

క్షతగాత్రుల పరిస్థితిని స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ వివరించారు. క్షతగాత్రులు అందరికీ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వీరిలో ముగ్గురు మాత్రం మూడ్రోజులు అబ్జర్వేషన్‌లో ఉండాలని స్విమ్స్ వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు తిరుమలలో స్థానికులకు వైకుంఠద్వార దర్శన టోకెన్లు జారీ కొనసాగుతోంది. తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 5 వేల టోకెన్లు జారీ చేశారు. పోలీసుల భద్రత మధ్య టీటీడీ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారు.

తిరుపతి ఘటన - ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఏం జరిగిందంటే?

తిరుపతి ఘటనపై మోదీ, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి - అధికారులపై సీఎం ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.