మున్సిపాలిటీల్లో ప్రజలు పారవేసే తడి, పొడి చెత్తలను పారిశుద్ధ్య సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలిస్తుంది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టం సమీపంలో డంపింగ్ యార్డులను సిద్ధం చేస్తున్నారు. తడి, పొడి చెత్తలను వివిధ అవసరాలకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ మిషన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఈ పురపాలక సంఘం పరిధిలోని.. పెద్దబొడ్డేపల్లి, బలిఘట్టం, జోగినాథుని పాలెం.. ప్రాంతాల్లో రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్నారు. దీన్ని వాహనాలపై తరలించి డంపింగ్ యార్డుల్లో నిల్వ చేస్తున్నారు. అయితే ఈ చెత్తను ఇతర ప్రయోజనాలకు కార్యాచరణను రూపొందించి అందుకు తగ్గట్టుగా పురపాలక సంఘం అధికారులకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఇందుకు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ పేర్కొంటున్నారు.
ఇదీ చదవండీ.. తుది ఘట్టానికి పుర పోరు ప్రచారం.. ఓట్ల కోసం అభ్యర్థుల పాట్లు