ETV Bharat / state

ఎన్నికల నిర్వహణ సవాలే

author img

By

Published : Feb 16, 2021, 7:44 AM IST

విశాఖ నగరంలోని 98 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2వ తేదీనుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో.. తిరిగి అక్కడినుంచే మొదలుపెట్టేందుకు అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. జీవీఎంసీ ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కోడ్‌ను అమల్లోకి తెస్తూ అన్ని జోన్ల రిటర్నింగ్‌ అధికారులకూ ఆదేశాలు జారీచేశారు. దీంతో వారంతా తమతమ విధుల్లో చేరిపోయారు. మార్చి పదిన జీవీఎంసీకి ఎన్నికలు జరగనున్నాయి.

municipal elections
municipal elections
  • నగరంలో జోన్‌లు 8
  • మొత్తం వార్డులు 98
  • మేయర్‌ రిజర్వేషన్‌ బీసీ జనరల్‌

అనకాపల్లి జోన్‌లోని 82వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్‌ వేసిన ఆళ్ల ఇందు పత్రాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఓటరు జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో అక్కడి ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు ఓటు హక్కు ఉందని నిరూపించుకునేందుకు గతేడాది మార్చి 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ గడువిచ్చారు. 15నే ఎన్నికల ప్రక్రియ వాయిదాపడింది. ఆమెకిప్పుడు మళ్లీ అవకాశం రావొచ్చని చెబుతున్నారు.

  • మొత్తం నామినేషన్లు 1361
  • ఆమోదం పొందినవి 1262
  • తిరస్కరణకు గురైనవి 99

ఎన్నెన్ని రోజులు పట్టిందో..

* నగరానికి 2012 ఫిబ్రవరిలో పాలవర్గం గడువు తీరిపోయింది. అప్పటినుంచి ఎన్నికలు జరగాల్సి ఉండగా పలు కారణాలతో జరగలేదు. 2020 మార్చి 9న ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో 8 ఏళ్ల తర్వాత ఎన్నికలకు మార్గం సుగమమైనట్లయింది.

* గతేడాది 18 రోజుల్లోనే ఎన్నికల్ని పూర్తిచేయాలని అప్పటి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. కానీ, కేవలం ఆరురోజుల ప్రక్రియ జరిగిన తర్వాత.. కొవిడ్‌ కారణంగా అర్ధంతరంగా ఎన్నికలు వాయిదాపడ్డాయి.

* అప్పటినుంచి నగర ఎన్నిక దోబూచులాడుతూనే వచ్చింది. వ్యవహారం కోర్టు కేసులు దాటి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయని ఎన్నికల కమిషన్‌ భావించడంతో దాదాపు 336రోజుల తర్వాత సోమవారం అదే ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

* అయితేే ఎన్నికలు కొనసాగిస్తున్నప్పటికీ.. తాజా నోటిఫికేషన్‌ నుంచి లెక్కింపు దాకా 27 రోజుల సమయమిచ్చింది. గతేడాది ఆరు రోజుల ప్రక్రియ, ఇప్పుడు 27రోజుల ప్రక్రియ.. ఈ ఎన్నికకు మొత్తం 33రోజుల సమయం.

* కొవిడ్‌ విరామంతో లెక్కేస్తే.. గతేడాది మార్చి 9 నుంచి ఈ ఏడాది మార్చి 14దాకా మొత్తం దాదాపు 370 రోజుల సమయం పడుతోంది.

  • మొత్తం ఓటర్లు ..17,53,927
  • పురుషులు 8,80,481
  • మహిళలు 8,73,320
  • ఇతరులు.. 126

నాయకుల ధోరణి ఏమిటో..

గతేడాది నామినేషన్‌ పత్రాల పరిశీలన తర్వాత ఇక ఎన్నిక నుంచి తప్పుకోవాలనుకున్నవారు మరో రోజులో ఉపసంహరించుకుంటారన్న సమయంలోనే ఎన్నిక వాయిదా పడింది. మరోవైపు ప్రధానపార్టీల నుంచి పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఇందులో ఇప్పుడు ఎవరు ప్రధాన అభ్యర్థి అవుతారనే సందేహం ఒకటైతే.. తమ అభ్యర్థి తమ పార్టీలోనే ఉంటారా లేక, నామపత్రం ఉపసంహరించుకుని ఇంకో పార్టీవారితో కలిసిపోతారా అనేది మరో సందేహం. గతేడాది నామపత్రాల పరిశీలనయ్యాక 352 రోజుల విరామంతో నామ పత్రాల ఉపసంహరణ తేదీల్ని ఇచ్చారు. ఈమధ్య కాలంలో రాజకీయంగా ఎన్నో మార్పులొచ్చాయి. నాయకులు పార్టీలు మారారు. ప్రాథమికంగా ఏ వార్డులో ఏం జరగబోతోందనేది వచ్చే నెల 3వ తేదీ దాకా వేచి ఉండాల్సిందే.

  • పోలింగ్‌ కేంద్రాలు 1712
  • అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు 2200
  • అవసరమైన పోలింగ్‌ సిబ్బంది 10,600
  • మొత్తం రూట్‌లు 204

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న విషయం నగర వాసుల్లో, నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన వైకాపాకు విశాఖ నగరంలో ఎదురుగాలి వీచింది. నగరంలోని నాలుగు కీలక నియోజకవర్గాలనూ తెదేపా సొంతం చేసుకుంది. అనంతర పరిణామల్లో రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించారు. ఆ నిర్ణయంతో నగరంలో వైకాపా బలోపేతం అవుతుందని భావించారు.

రాజధాని ప్రకటన తమకు లాభిస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా ఉక్కు కర్మాగారం అంశం తెరపైకి వచ్చింది. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయానికి నగరవాసుల నుంచి వ్యతిరేకత వస్తోంది. వైకాపా కూడా ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ మేరకు కేంద్రంపై విమర్శలు కూడా చేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక కేంద్రాన్ని ఒప్పించి కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ప్రకటన వెలువడేలా చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

నానాటికీ తీవ్రమవుతున్న పోరు: ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం, తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిరాహారదీక్షకు దిగడంతో ఉక్కు ఉద్యమానికి మరింత బలమిచ్చింది. వారి నిర్ణయాలకు ఉక్కు ఉద్యోగుల నుంచి స్పందన లభిస్తోంది. రోజురోజుకూ ఉక్కు ఉద్యమం మరింత బలోపేతం అవుతుండడంతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది.

నగరవాసుల తీర్పే కీలకం: నగరవాసులు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్న విషయాన్ని కూడా కార్పొరేషన్‌ ఎన్నికలే తేల్చనున్నాయి. నగరంలోని వార్డులు 72 నుంచి 98కి పెరిగాయి. అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, పది పంచాయతీలను నగర పరిధిలోకి తెచ్చారు. వారి మనోగతమూ కీలకంగా మారే అవకాశం ఉంది.

కొంత ఇరకాటం: ప్రైవేటీకరణ నిర్ణయం భాజపా తీసుకున్నది కావడంతో ఆ పార్టీ స్థానిక నాయకులు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. భాజపాతో పొత్తు ఉండటంతో జనసేనకూ అదే పరిస్థితి ఎదురవుతోంది. పరస్పరం సహకరించుకుని కొన్ని స్థానాలైనా దక్కించుకుందామన్న ఆలోచన చేసిన భాజపా, జనసేనలకు ప్రైవేటీకరణ నిర్ణయం ఏ విధంగా పరిణమిస్తుందో అన్న గందరగోళం నెలకొంది.

సెంటిమెంటుదే కీలకపాత్ర: ఉక్కు కర్మాగారం నగరవాసుల సెంటిమెంటుగా మారిందని పలువురు విశ్లేసిస్తున్నారు. కర్మాగారం లేకపోతే విశాఖ నగరమే లేదనే స్థాయిలో కొందరు వాదిస్తున్నారు. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ అంశం నగర ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమైనదిగా మారుతుందని వెల్లడిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కర్మాగార ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయా పరిణామాలు ఎవరికి అనుకూలంగా మారతాయన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.

అభ్యర్థులు చనిపోయినచోట్ల ఎలా..!?

గర ఎన్నికల ప్రక్రియలో గతేడాది నామినేషన్‌ వేసిన తర్వాత ఇద్దరు వైకాపా అభ్యర్థులు చనిపోయారు. ఇద్దరూ జోన్‌-5కు చెందినవారే. 77వ వార్డులో వైకాపా తరఫున బరిలో దిగిన సన్యాసిరావు, 79వ వార్డులో బరిలో దిగిన గోపిరాజు అనారోగ్యంతో మృతిచెందారు. సన్యాసిరావును వైకాపా ప్రధాన అభ్యర్థిగా ప్రకటించింది. ఈ రెండు వార్డుల్లోనూ వైకాపా నుంచి అదనంగా ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో ఇక్కడి ఎన్నికల పరిస్థితి ఏంటనేది కాస్త సందిగ్దంగా మారింది. అయితే పార్టీ సంప్రదించే ప్రక్రియనుబట్టి ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

నిర్ణయం ఎలా ఉండొచ్చు

* అధికారులిచ్చిన సమాచారం ప్రకారం...జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ గతేడాది ఆగినప్పుడు ఇంకా వార్డుల వారీ పోటీదారు అభ్యర్థుల ప్రకటన కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు రద్దయ్యే అవకాశాలు స్వల్పం. ఎందుకంటే.. అభ్యర్థుల ప్రకటన జరగలేదు కాబట్టి మరో వ్యక్తి పార్టీ పరంగా నామినేషన్‌ వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇవ్వొచ్ఛు

* ఒకవేళ ప్రధాన అభ్యర్థులే చనిపోయి, పార్టీ కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరితే.. అక్కడ ఎన్నిక రద్దు చేసేందుకూ అవకాశం ఉండొచ్ఛు ఇది చాలా అరుదు అని చెబుతున్నారు.

* అయితే నిర్ణయమేదైనా ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని జీవీఎంసీ ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావు దగ్గర ప్రస్తావించినప్పుడు.. పార్టీ ప్రతినిధులు ఇంకా తమను సంప్రదించలేదని, వారు అభ్యర్థించే విషయాన్నిబట్టి ఎస్‌ఈసీతో సంప్రదిస్తామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణ సవాలే

పురఎన్నికలు పునఃప్రారంభమైన నేపథ్యంలో నగరంలో సందిగ్ద పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణని అడ్డుకునేందుకు పలు రాజకీయపార్టీలు ఉద్యమం చేస్తున్నాయి. ఇది ఊపందుకుంటోందనుకుంటున్న తరుణంలో..

సోమవారం నుంచి ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చింది. ఉద్యమానికి, ఎన్నికల కోడ్‌కు సంబంధం లేకపోయినప్పటికీ.. రాజకీయ పార్టీలే ఉద్యమం చేస్తుండటంతో.. నేతలు డైలమాలో పడిపోతున్నారు. ఎటువైపు దృష్టి కేటాయించాలనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తాజా నోటిఫికేషన్‌లో మార్చి 2 నుంచి ప్రధాన ప్రక్రియ మొదలవనుండటంతో కాస్త ఊరట కలిగిస్తోంది. అప్పటిదాకా ఉద్యమంలో మరింత ముందుకెళ్లాలని పలు పార్టీలు యోచిస్తున్నాయి. మార్చి 3న అభ్యర్థుల ప్రకటన తర్వాత.. ప్రచారంపై దృష్టిసారించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరెవరు నామినేషన్లను ఉపసంహరించుకోవాలనేదానిపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం.

కోడ్‌ ఉన్నప్పుడు ఎలా..!

ఎన్నికల కోడ్‌ సోమవారం నుంచి అమల్లోకి వచ్చేసింది. ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనేదానిపై కొందరు నేతల్లో పూర్తి అవగాహన లేదు. ఎన్నికల ప్రక్రియలో కీలకంగా ఉన్న అధికారుల్ని సంప్రదించినప్పుడు కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే..

* ఎన్నికలకు, ఉద్యమానికి సంబంధం లేదు. ఈ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వం మీదో, స్థానిక అధికారుల మీదో జరగడంలేదు. ఓ సామాజిక సమస్యగా పోరాడుతున్నారు కాబట్టి ఉద్యమం కోడ్‌ పరిధిలోకి రాదని చెబుతున్నారు.

* ఎన్నికల కోడ్‌కు ముందునుంచే ఉద్యమం ఉంది. కొత్తగా వచ్చిన కార్యక్రమం కాదు కనుక చేసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. అయితే ఉద్యమంలో జరిగే ప్రతీ ప్రక్రియ మీదా అధికారుల నిఘా ఉంటుందని స్పష్టత ఇస్తున్నారు.

* ఎన్నికల సరళిని, ఎన్నికల విధానాన్ని విమర్శిస్తే మాత్రం కోడ్‌ పరిధిలోకి వస్తుందని అధికారులు అంటున్నారు. కోడ్‌కు అటంకం కలిగించే ఏ అంశంపైనైనా చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారాలుంటాయన్నారు.

* ఉద్యమం నేపథ్యంలో అధికారులు కూడా ఎన్నికల కమిషన్‌తో మాట్లాడి మరింత స్పష్టత తీసుకోవాల్సిన అవసరముందని వెల్లడిస్తున్నారు. కమిషన్‌ నుంచి రాజకీయ పార్టీలకు స్పష్టమైన ఆదేశాలు, సూచనలు వెళ్తాయని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.