ETV Bharat / state

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు

మున్సిపల్​ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. నాయకులు ప్రచార జోరు పెంచారు. విశాఖపట్నంలో పలు పార్టీల నేతలు ఇంటింటికీ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటేసి.. గెలిపించాలని అభ్యర్థస్తున్నారు.

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు
విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు
author img

By

Published : Mar 4, 2021, 9:27 AM IST

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీపీఐ నారాయణ

విశాఖలోని గాజువాక చినగంట్యాడ 72వ వార్డులో ఎన్నికల ప్రచారంలో.. సీపీఐ నారాయణ పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడితే స్టీల్​ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుస్తుందన్నారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలు చేసి... దిల్లీలో పాదపూజ చేస్తోందంటూ ధ్వజమెత్తారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ

విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని... విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోరారు. నగరంలోని 22వ వార్డులో తెదేపా అభ్యర్థి బొట్ట రమణకు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానికంగా సుపరిచితుడైన బొట్ట రమణను గెలిపిస్తే.. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.

వైకాపాను గెలిపిస్తే.. సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి: జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి

ఆంధ్రప్రదేశ్​లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని.. మద్య విమోచన కమిటీ రాష్ట్ర ఛైర్మన్, జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి అన్నారు. వైకాపాను గెలిపిస్తే సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందుతాయని చెప్పారు.

మాడుగులలో ఎన్నికల ప్రచారం

విశాఖ జిల్లా మాడుగులలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు ప్రచారం జోరందకుంది. మాడుగులలో వైకాపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిముడు రమణమ్మ... పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం మెుదలుపెట్టారు. ఇంటింటికీ వెళ్లి తమకు ఓటు వెయ్యాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.