కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద వైరస్ నాశక రసాయనాలను పిచికారీ చేయించారు. ప్రధానంగా నర్సీపట్నం శ్రీ కన్య కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, వీర్రాజు థియేటర్ కూడలి, ఆర్డీవో కార్యాలయం, అభి సెంటర్, కృష్ణ బజార్, ప్రాంతీయ ఆసుపత్రితో పాటు పలు వ్యాపార కేంద్రాల వద్ద మందులు చల్లించారు. వ్యాధులు, దోమల వ్యాప్తి నివారణకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు పురపాలక శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: