మల్టీ లెటరల్ మారిటైం ఎక్సర్సైజ్ (మిలన్)- 2020 నిర్వహణ కోసం తొలిసారిగా విశాఖ నౌకాదళం సన్నద్ధమవుతోంది. మార్చి నెలలో జరగబోయే ఈ కార్యక్రమానికి దాదాపు 40 దేశాల నుంచి 50 మందికిపైగా విన్యాసాలు చేయడానికి రానున్నారు. కార్యక్రమం వివరాలు కోసం నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ ఒక వెబ్సైట్ ప్రారంభించారు. భారత నౌకాదళం రెండేళ్లకోసారి అండమాన్ నికోబార్ దీవుల్లో 1995 నుంచి విన్యాసాలను నిర్వహిస్తోంది. మొదట కొన్ని దేశాల భాగస్వామ్యంతోనే ప్రారంభమైన ఈ విన్యాసాలు ఇప్పుడు 40కి పైగా దేశాలు పాల్గొనే స్థాయికి చేరింది. ఈ విన్యాసాలు పాల్గొనేందుకు ఇప్పటివరకు దాదాపు 22 దేశాలు వరకు తమ సమర్థత తెలియజేశాయి.
ఇదీ చూడండీ: బంగ్లాదేశ్‌కు చిక్కిన ఫిషింగ్ బోటు వచ్చేసింది