సింహాచలం ఆలయ భూముల విషయంలో వైకాపా, తెదేపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్రమాలు జరిగాయని వైకాపా నేతలు ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు నిరూపించలేకపోయారని తెదేపా నేతలంటున్నారు. దీంతో నిత్యం ఏదో ఒక అంశం తెరపైకి వస్తోంది.
సింహాచలం ఆలయంలో 830 ఎకరాల భూముల లెక్కలు మాయమయ్యాయని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. తెదేపా నాయకుడు చంద్రబాబు వల్లే.. అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యే, మంత్రి పదవులను పొందగలిగారని ధ్వజమెత్తారు. ఈవో రామచంద్రమోహన్ హయాంలో ఈ భూములు లెక్కలు తారుమారైనట్లు విమర్శించారు. రాజులైతే చట్టానికి అతీతులు కాదు కదా అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ.. brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!