ETV Bharat / state

'పోలవరానికి కేంద్రం సహకరిస్తోంది.. ప్రాజెక్టు డిజైన్​లో మార్పులు ఉండవు' - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు

డిసెంబర్ 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తోందనీ.. ప్రాజెక్టు విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.

mp vijaisaireddy
mp vijaisaireddy
author img

By

Published : Nov 13, 2020, 10:27 AM IST

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తునట్టు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఏ మార్పులు ఉండవని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతుందన్నారు. డిసెంబర్ 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందన్నారు. పోలవరానికి కేంద్రం సహకరిస్తునట్టు పేర్కొన్నారు. నిధులు సమస్య లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవని.. కానీ వాటిని సమన్వయపరచుకుని చేసేదే నిజమైన పరిపాలనగా చెప్పుకొచ్చారు. విశాఖలో జీవీఎంసీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాలకు మేలు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.