సమాజ ప్రగతిలో జర్నలిస్టులు పాత్ర ప్రశంసనీయమని.. వారు నిరంతర శ్రామికులు అని మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ ఇండియా అధినేత జేవీ ప్రభాకర్ అన్నారు. విశాఖలోని డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో పలువురు జర్నలిస్టులకు కొవిడ్ మందులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
ఈ సంస్థ ద్వారా గత ఏడాది కరోనా సమయంలోనూ నిరుపేదలకు సుమారు రూ. 10 లక్షలు విలువైన నిత్యవసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేశామని ప్రభాకర్ గుర్తుచేశారు. ఈ ఏడాది ఇప్పటికే పది వేల మందికి చేయూత ఇచ్చామని, తాజాగా కొంతమంది జర్నలిస్టులకు సాయం చేశామని.. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సంస్థ అధినేత జేవి ప్రభాకర్ అన్నారు.
ఇదీ చదవండి.. రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు