ETV Bharat / state

తాగుడుకు బానిసయ్యాడని కన్నబిడ్డపై కత్తితో తల్లి దాడి - ఆరిలోవలో కొడుకుపై తల్లి దాడి

చెడు అలవాట్లకు బానిసై వేధిస్తోన్న కుమారుడిపై కన్నతల్లే కత్తితో దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా ఆరిలోవలో జరిగింది. రోజూలాగానే మద్యం కోసం డబ్బులు ఇమ్మంటూ తల్లిని వేధించాడు ఆ కుమారుడు. ఇద్దరికి జరిగిన పెనుగులాటలో ఆగ్రహంతో కత్తితో మెడమీద కోసేసింది.

Mother attacked on her son with a knife at arilova in visakhapatnam
కలకలం.. తల్లే కుమారుడిపై కత్తితో దాడి
author img

By

Published : Feb 15, 2020, 6:18 AM IST

విశాఖ జిల్లా ఆరిలోవలో కన్నతల్లే తన కుమారుణ్ని కత్తితో మెడమీద కోసిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన రమేష్​ తాగుడు, గంజాయి వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ తల్లి లక్ష్మిని రోజూ వేధిస్తుండేవాడు. తనకు డబ్బులు కావాలని శుక్రవారం కూడా తల్లితో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోతే పీక కోసుకుంటానని కత్తితో బెదిరించాడు. ఇద్దరి మద్య జరిగిన పెనుగులాటలో రమేష్​పై కత్తితో దాడి చేసింది. బాధితుణ్ని స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెనుగలాటలో గాయాలయ్యాయని లక్ష్మి చెబుతున్నప్పటికీ.. కావాలనే తన కొడుకును కత్తితో పొడిచిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వాంగ్మూలంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

విషాదాంతం... విశాఖలో చిన్నారి మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.