స్టైరీన్ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ పర్యటించారు. ఎల్జీ సంస్థ రసాయన పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించినా, సంస్థకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇక్కడకు తీసుకురావాలని కోరారు. ఈ పరిశ్రమపై విశాఖ ప్రజల ఉపాధి ఆధారపడి ఉందనీ, ఉపాధిని పోగొట్టే చర్యలు లేకుండా చూడాలన్నారు.
పరిశ్రమ నుంచి స్టైరీన్ వాయువు తరలిస్తున్నా, కంపెనీ ప్రతినిధులు ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. పీఎంవో కార్యాలయం పాలిమర్స్ పరిశ్రమ పరిణామాలను పరిశీలిస్తోందని వివరించారు. బాధిత గ్రామాలకు కేంద్రం నుంచి ఉన్నత స్థాయి వైద్య బృందం వచ్చి ప్రతి గ్రామస్థుడిని పరీక్షించాలని కోరారు. గ్రామస్థులకు ఎల్జీ పరిశ్రమ వర్గాలు నేటి నుంచి భోజనాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు: విషవాయువు బాధితులు