గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేదని భాజపా ఎమ్మెల్సీ పీవీ మాధవ్ ఆరోపించారు. కుల ప్రభావం వైకాపా, తెదేపాపై ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. భాజపా ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : "వైకాపా పాలనతో.. తెదేపా పునాదులు కదులుతున్నాయి"